సమంతకు ‘శాకుంతలం’ చాలా దెబ్బ కొట్టేసింది. చాలా ఆశలు పెట్టుకుంది ఈ సినిమాపై సమంత. ఇంతవరకూ సమంత చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఆమెని నిరాశపరచలేదు.
‘ఓ బేబీ’, ‘యశోద’ చిత్రాలు సమంతకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందేలా చేశాయ్. కానీ, ‘శాకుంతలం’ తీవ్రంగా నిరాశపరిచింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయ్ ఈ సినిమాకి.
ఈ సినిమా ప్రమోషన్లలో సమంత తన పర్సనల్ లైఫ్ గురించీ, హెల్త్ ప్రాబ్లమ్ గురించి పదే పదే ప్రస్థావించడం జరిగింది. అది ఒకింత సింపతీ క్రియేట్ అవుతుందనుకుందేమో సమంత.
కానీ, బెడిసికొట్టింది. సింపతీ కాదు కదా.. రివర్స్ కొట్టేసింది. దాంతో, సమంతను ఇకపై ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిదని ఆమె సన్నిహితులే స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట.
నిజానికి పెద్ద సమస్యలే అయినా, అవేమీ సమంత కెరీర్‌కి ఏ రకంగానూ ఉపయోగపడింది లేదు. సో, సమంతా.! ఈ జీవిత సత్యం తెలుసుకుంటే మంచిదేమో.!