అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తున్న సమంత యశోద పోస్టర్.. అసలేమైందంటే?

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సినిమాలకు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే ఇలా సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తే క్రమంలో కొందరు వాటిలో చిన్న చిన్న లాజిక్కులను పట్టుకొని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి పోస్టులు కొన్ని వివాదాలు కూడా కారణమవుతూ ఉంటాయి. అసలు ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారు, ఇంత చిన్న లాజిక్కులను ఎలా గుర్తిస్తున్నారనే విషయాలపై సందేహాలు వ్యక్తం అవుతుంటాయి.

ఇకపోతే తాజాగా ఇలాంటి ఘటన సమంత యశోద సినిమా పోస్టర్ విషయంలో చోటుచేసుకుంది. సమంత తాజాగా పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ చిత్రంగా యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా హిట్ కావడంతో చిత్ర బృందం త్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ పేరుతో మరొక పోస్టర్ విడుదల చేశారు. ఇలా ఈ పోస్టర్ పెట్టల చేయడంతో ఈ పోస్టర్లో అక్కినేని అభిమానులు లాజిక్కులు గుర్తించి పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

అక్కినేని అభిమానులు మండిపడేలా ఈ సినిమా పోస్టర్ లో ఏముంది అనే విషయానికి వస్తే… చిత్ర బృందం విడుదల చేసిన త్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ (Thrilling Blockbuster) అనే పోస్టర్ లో NC అనే రెండు లెటర్స్ కు సమంత ఫోటోతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇలా NC అని లెటర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయడంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే నాగచైతన్యను దృష్టిలో ఉంచుకొని ఈ లెటర్స్ ఇలా డిజైన్ చేశారనీ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.