విజయ్ దేవరకొండతో సమంత ఇంకోస్సారి.!

విజయ్ దేవరకొండతో సమంత ఇంకోసారి జత కట్టబోతోందట. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఖుషి’ సినిమాపై బాగా అంచనాలు నెలకొన్నాయ్. ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. ప్రోమోలూ, పోస్టర్లూ బాగా ఆకట్టుకుంటున్నాయ్. దాంతో, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని అంటున్నారు.

సో, ఇదే మూడ్‌లో ఇంకో సినిమా తీసేయాలని అనుకుంటున్నారట. ఈ సారి రాబోయే సినిమాని విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్‌లో రూపొందించేందుకు సిద్ధంగా వున్నాడట. అయితే, ఈ సినిమా ఎక్కువ పార్ట్ సమంత వైపు నుంచే వుండబోతోందనీ తెలుస్తోంది. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావచ్చని అంటున్నారు.

రౌడీ కూడా నటిస్తాడట. కానీ, గెస్ట్ రోల్ తరహాలో విజయ్ దేవరకొండ రోల్ వుండబోతోందనీ ప్రచారం జరుగుతోంది. అంతా బాగానే వుంది. కానీ, సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తసీుకుంటున్నట్లు ప్రకటించింది కదా.! మరి ఇదేం ట్విస్టు అంటారా.? అదే ట్విస్ట్. ‘ఖుషి’ సినిమాతో విజయ్ దేవరకొండకీ, సమంతకీ మధ్య మంచి స్నేహం కుదిరింది. సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆమెతో బాగా క్లోజ్ అయ్యాడు విజయ్ దేవరకొండ.

మొన్నీ మధ్య జరిగిన ‘ఖుషి’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆమె కళ్లలో సంతోషం చూడడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం. ఈ మధ్య సమంతను ఫెయిల్యూర్స్ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రౌడీ ఈ డెసిషన్ తసీుకున్నాడో ఏమో. ఓ యంగ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడట.