ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న సమంత

గతంలో అన్నపూర్ణా స్టూడియోస్ వ్యవహారాల్ని ఒకింత జాగ్రత్తగా ఆకళింపు చేసుకుంది సమంత. అప్పట్లో అక్కినేని నాగచైతన్య సతీమణి మరి.! కానీ, ఇప్పుడు సీన్ మారింది కదా.! నాగచైతన్య మాజీ భార్య అయిపోయింది సమంత.

చాలాకాలంగా సమంత, సొంత నిర్మాణ సంస్థ కోసం సన్నాహాలు చేస్తూ వస్తోంది. త్వరలోనే ఆ ముచ్చట తీర్చేసుకోనుందట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు నిర్మించేలా ఈ బ్యానర్ స్థాపించాలనుకుంటోందట సమంత.

తాను నటించే సినిమాలకు సంబంధించి నిర్మాణంలో కొంత భాగం మాత్రమే తీసుకుంటుందట సమంత తాను స్థాపించబోయే బ్యానర్ ద్వారా. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతానికైతే సమంత తెలుగులో ‘శాకుంతలం’ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె చేతిలో వున్న మరో తెలుగు సినిమా ‘ఖుషీ’. ఇవి కాక, హిందీలో ఓ రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ వున్నాయి.