సమంతకి ఏమయ్యింది.? ఏడాదిపాటు సినిమాలకు విరామం ఎందుకు ప్రకటించబోతోంది.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఔనట.! సమంత ఏడాదిపాటు ఏ సినిమాలోనూ నటించకూడదని తీర్మానించుకుందట. సినిమాలే కాదు, వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించబోదట.
కొన్నాళ్ళపాటు మీడియాకి కూడా అందుబాటులో వుండబోదట. కారణం, మయోసైటిస్.. అనే అంటున్నారు. విదేశాల్లో వైద్య చికిత్స కోసం వెళ్ళబోతోందట సమంత. ‘యశోద’ సినిమా టైమ్‌లో బయటపడ్డ మయోసైటిస్, ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది.
కానీ, ఇంతలోనే కష్టతరమైన కసరత్తులు చేస్తూ, తిరిగి యాక్టివ్ అయ్యింది సమంత. ‘ఫైటర్ సమంత’ అన్న గుర్తింపు బాగానే వున్నా, ఆ అతి కసరత్తులు కొంప ముంచేశాయట. ఈసారి లాంగ్ గ్యాప్ తీసుకోకపోతే కష్టమేనని వైద్యులు సూచించడంతో, ఏడాది.. ఆ పైన విదేశాల్లో వుండి వైద్య చికిత్స తీసుకుని, పూర్తిగా కోలుకున్నాకనే ఇండియాకి రావాలనుకుంటోందట సమంత. అద్గదీ అసలు సంగతి.