టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న సమంత నటిగానే కాకుండా అనేక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ అక్కినేని కోడలు అనిపించుకుంటుంది. రీసెంట్‌గా తన మామ గైర్హాజరు కారణంగా బిగ్ బాస్ షోని హోస్ట్ చేసి మామకు తగ్గ కోడలు అంటూ ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇన్నాళ్ళు సినిమాలకే పరిమితమైన సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు చేయడంతో పాటు పలు బ్రాండ్స్‌కు ప్రచార కర్తగాను వ్యవహరిస్తుంది. మరోవైపు సేంద్రీయ వ్యవసాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.
బిజినెస్ రంగంలోను అడుగుపెట్టిన సామ్ ఇటీవల `సాకీ` పేరుతో ఫ్యాషన్ డిజైనింగ్ వేర్‌ని ప్రారంభించింది. అలాగే `యుర్‌లైఫ్` పేరుతో ఉపాసన ప్రారంభించిన హెల్త్ ఛానెల్‌కి గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంది. ఇలా అనేక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటూనే అడపాదడపా తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా సమంతకు ఓ నెటిజన్ నుండి విచిత్ర ప్రశ్న ఎదురైంది. దీనికి సమంత ఇచ్చిన సమాధానం అందరు అవాక్కయ్యేలా చేసింది.
మీరు శృంగారానికి ప్రయారిటీ ఇస్తారా? ఫుడ్‌కి ప్రయారిటీ ఇస్తారా? అని సమంతని నెటిజన్ ప్రశ్నించగా, సామ్ అందుకు బదులిస్తూ.. ఎంతఆకలితో ఉన్నా, ఆహారం కంటే సెక్స్ నే ఎక్కువ ఇష్టపడతానని తెలిపి షాకింగ్ కామెంట్ చేసింది. సమంత నుండి ఇలాంటి సమాధానం రావడంతో అంతా నోరెళ్ళ పెడుతున్నారు. అయితే తనకు పెళ్ళై మూడుళ్ళు అవుతున్నా, ఇంకా పిల్లలు లేకపోవడంతో దీనిపై ఓ అభిమాని ప్రశ్నించారు. అందుకు సామ్ స్పందిస్తూ, నాకు పిల్లలు ఎప్పుడైతే కావాలని కోరుకుంటానో, నాకు. బిడ్డ పుట్టినప్పుడే, ఆ బిడ్డే నాకు ప్రపంచమవుతుంది` అని పేర్కొంది. ..