వైరల్ : విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పై సమంత షాకింగ్ కామెంట్స్

రానున్న రోజుల్లో టాలీవుడ్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు శివ నిర్వాణ హీరో విజయ్ దేవరకొండ అలాగే సమంత హీరోయిన్ గా చేసిన లవ్ డ్రామా చిత్రం “ఖుషి” కూడా ఒకటి. మరి నెక్స్ట్ వీక్ కి అయితే బిగ్ రిలీజ్ గా ఇదే రాబోతుండగా డెసెను బజ్ ఈ చిత్రంపై ఉంది.

కాగా ఈ చిత్రం రిలీజ్ పాన్ ఇండియా లెవెల్లో ఉండడంతో చిత్ర యూనిట్ కూడా మంచి ప్రమోషన్స్ ని ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఇదే చిత్రం సమయంలో సమంత అలాగే హీరో విజయ్ దేవరకొండ ఒకరి కోసం ఒకరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకోవడం పరస్పరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే గత కొన్ని రోజులు కితమే విజయ్ సమంత అంటే నాకు ఎప్పుడు నుంచో క్రష్ అని అది ఎప్పటికి పోదు అని చెప్పగా లేటెస్ట్ గా సమంత విజయ్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ ని చాలా మంది ఏదో అనుకుంటారు మంచివాడు కాదు చాలా చేదు అలవాట్లు ఉంటాయి అని కానీ అసలు నిజం ఏమిటంటే విజయ్ కి ఒక్క చెడు అలవాటు కూడా లేదు.

ఇది తెలిసి నేనే షాక్ అయ్యాను అని సమంత రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. దీనితో విజయ్ విషయంలో ఈ షాకింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక వీరు నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.