Samantha: బేబీ బంప్ తో కనిపించిన సమంత.. సోషల్ మీడియాని షేర్ చేస్తున్న పిక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

Samantha: సినీనటి సమంత ప్రస్తుతం సినిమాల పై పూర్తి దృష్టి పెట్టారని చెప్పాలి. గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ప్రస్తుతం తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక సమంత ఒకవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి. ఈ ఫోటోలో సమంత ఏకంగా బేబీ బంప్ తో కనిపించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సమంత ఈ ఫోటోని ఎక్కడా కూడా తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయలేదు కానీ ఈ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇది చూసిన అభిమానులు బహుశా సమంత ఏదైనా సినిమాలో ఇలాంటి పాత్రలో కనిపించబోతుందేమోనని భావించారు.

ఇక నాగచైతన్యతో పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న తర్వాత ఈమె పలు సందర్భాలలో తల్లి కావడం గురించి మాట్లాడారు. ఇలా తల్లి కావడం గురించి సమంత గతంలో మాట్లాడటంతో అందుకు తరహా పాత్రలలో ఈమె నటిస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేశారు కానీ ఈ ఫోటో సమంత సినిమాలకు సంబంధించినది కాదని ఇక ఈ ఫోటోని సమంత షేర్ చేసినది కూడా కాదని తెలుస్తోంది.

ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కొంతమంది సమంత ఫోటోని ఇలా క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారని తెలుస్తోంది. గతంలో ఎంతో మంది సెలబ్రిటీల ఫోటోలను కూడా ఇలా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తాజాగా సమంత బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో సమంత అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు సెలబ్రిటీల అనుమతి లేకుండా షేర్ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. మరి ఈ ఫోటోపై సమంత రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.