ఈ ఏడాదిలో చూసిన ఉత్తమ చిత్రం ఇదేనంటోంది సమంత!

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. మయోసైటిస్‌తో బాధ పడుతున్న ఆమె ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం కోసం విదేశాలకు వెళ్లొచ్చారు. ప్రస్తుతం వర్క్‌ ఒత్తిడికి కాస్త దూరంగా ఉంటూ రిలాక్స్‌ అవుతున్నారు.

అయితే తన డైలీ రొటీన మాత్రం ఏమ మారలేదు. జిమ్‌లో వర్కవుట్స్‌ యధావిధిగా చేస్తోంది. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతోపాటు.. తాను చూసిన చిత్రాల రివ్యూలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా మమ్ముట్టి`జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాథల్‌ ‘ది కోర్‌’ పై ఆమె స్పందించారు. ”కాథల్‌ ‘ది కోర్‌’ అత్యద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో చూసిన ఉత్తమ చిత్రం ఇదే! అందరూ చూడాల్సిన శక్తిమంతమైన సినిమా. మమ్ముట్టి నా హీరో. ఇందులో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఈ సినిమా చూశాక పొందిన అనుభూతి నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లవ్యూ జ్యోతిక” అని ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దర్శకుడు జీయోబాబీని లెజెండ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సమంతకు కృతజ్ఞతలు అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.