ఆ ఉద్దేశ్యం లేదంటున్న సమంత.! కానీ, ఎందుకు.?

సమంత నటించిన ‘ఖుషి’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు ఈ సినిమాలో.

కాగా, సమంత నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ ఇంకా స్ట్రీమింగ్ కావాల్సి వుంది. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని సైన్ చేసిన సమంత, ఇప్పుడెందుకో కాస్త స్లో అయ్యింది.

చేస్తున్న సినిమాలు తక్కువే అయినా, సమంత పేరు మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో మార్మోగుతూనే వుంది. ఓ సినిమాకి సమంత సైన్ చేసిందిగానీ, చివరి నిమిషంలో ఆమె తప్పుకోవడంతో, ఆ స్థానంలోకి రష్మిక వచ్చి చేరింది.

తాజాగా, ఓ మహిళా దర్శకురాలు సమంతతో తెరకెక్కించాలనుకున్న సినిమా కూడా చేతులు మారినట్లు తెలుస్తోంది. సమంత స్థానంలో మృనాల్ ఠాకూర్ పేరు పరిశీలనలోకి వచ్చిందట.

ఎమోషనల్ టచ్‌తో కూడిన థ్రిల్లర్ మూవీ అనీ, సమంత ఏ కారణం వల్లనో ఆ సినిమాకి చివరి నిమిషంలో ‘నో’ చెప్పిందనీ అంటున్నారు. చిత్రమేంటంటే, ఆ మహిళా దర్శకురాలు, సమంతకి అత్యంత సన్నిహితురాలు.