సమంత మరో సినిమా ఓవర్సీస్ హక్కులు మళ్ళీ వారికే.!

Shaakuntalam

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న లేటెస్ట్ మరో అవైటెడ్ చిత్రం “శాకుంతలం”. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం “యశోద” తో భారీ హిట్ అందుకోగా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

అయితే ఇప్పుడు ఈ సినిమా భారీ సక్సెస్ తర్వాత సమంత నటించిన మరో చిత్రం థియేట్రికల్ రిలీజ్ హక్కులు ఇదే యశోద సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారే “శాకుంతలం” చిత్రాన్ని కూడా యూఎస్ లో రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. 

ఇక ఈ భారీ పీరియాడిక్ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కించగా మేల్ లీడ్ లో నటుడు దేవ్ మోహన్ నటించాడు. అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు గుణ టీం వర్క్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.