వైరల్ పిక్ : 16ఏళ్ల సమంతని చూసారా?

సౌత్ ఇండియా సినిమా దగ్గర తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా సహా వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లు కూడా చేసే స్థాయికి మారిన హీరోయిన్ సమంత. తన పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు నిలదొక్కుకున్న సమంత రీసెంట్ గా అయితే భారీ చిత్రం “శాకుంతలం” తో ముందుకు వచ్చింది.

కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ట్ అయ్యింది. ఇక దీని తర్వాత వెంటనే తేరుకొని తన ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ రీమేక్ “సిటాడెల్” తో అయితే సిద్ధం అవుతుంది. మరి ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఇప్పుడు సమంత చురుగ్గా పాల్గొంటుంది. మరి ఇదిలా ఉండగా సమంత అయితే తన లుక్స్ పరంగా కూడా తన ఈ కెరీర్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది.

ఐతే వాటిపై కూడా ట్రోల్స్ వచ్చాయి కానీ సమంత మాత్రం తన స్టార్డం తో మంచి మార్కెట్ ని ఆమె సొంతం చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పిక్ అయితే వైరల్ గా మారింది. బహుశా సమంత కెరీర్ స్టార్టింగ్ లో 20 ఏళ్ళు అప్పుడు చూసి ఉంటాం.

కానీ ఇప్పుడు ఓ అరుదైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదైతే సమంత కేవలం 16 ఏళ్ళు వయసు ఉన్న ఫోటో. మరి ఇందులో సమంత చాలా యంగ్ గా ఛార్మింగ్ గా కనిపిస్తుంది. కాకపోతే అప్పుడులో ఇప్పుడుకి అప్పటికి తన ఫేస్ లో చాలా తేడా ఉందని కూడా చెప్పొచ్చు. ఇక దీనితో ఈ రేర్ ఫోటో అయితే అభిమానుల్లో కూడా మంచి వైరల్ గా మారింది.