RRRలో రామ్ స్లోగన్ తో వైరల్ గా మారిన సామ్ పోస్ట్.!

Samantha-Ruth-Prabhu-breaks-down-1

సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. మరి సమంత ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉంది. అంతే కాకుండా రీసెంట్ గానే ఆమె నటించిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయిపొయింది.

ఐతే ఈ సినిమా సమయంలోనే సామ్ కి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఆమె సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. కానీ ఫైనల్ గా మాత్రం ఆమె కష్టం మేకర్స్ కష్టానికి డిజాస్టర్ ఫలితమే మిగిలింది. కాగా మరి దీనిపైనే అన్నట్టుగా తాను లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇండియన్ ప్రైడ్ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) లో హీరో రామ్ చరణ్ పాత్ర స్కాట్ ఎదురుగా చెప్పే “కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన మా ఫలే హు తుర్భుహః మా తే సంఘోత్సవ కర్మణి” అని చెపుతాడు. ఇది అందరికీ బాగా స్ట్రైక్ అయ్యే డైలాగ్ కూడా.

అయితే సరిగా దీనినే సమంత కూడా పోస్ట్ చేయడం అనేది వైరల్ గా మారింది. అయితే ఇది శాకుంతలం ఫలితం కోసమే పెట్టినట్టుగా అర్ధం అవుతుంది. చివరి వరకు పని చేయడమే తనవంతు ఫలితంతో తనకి సంబంధం లేదు అన్నట్టుగా సామ్ మదిలో ఉన్న దాని వెనుక ఉన్న సారాంశం. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.