Samantha: సమంత దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో ఒకరు పెళ్లి తర్వాత ఆలోచించి కథా పరమైన సినిమాలు చేస్తున్న సమంత చైతూ తో విడాకుల తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది.అటు నార్త్ ఇటు సౌత్ ను కలుపుతూ ఏకంగా హాలీవుడ్ వైపు కూడా చూస్తోంది. వరుస ప్రాజెక్టులతో మిగతా హీరోయిన్ లకు చమటలు పట్టిస్తోంది. పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోదర షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకో ప్రాజెక్ట్ కి ఒక చేసింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించనుంది సామ్. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ లో నటించనుంది. ఇలా బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.
అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది సమంత.మోటివేషనల్ కొటేషన్స్, టూర్ ఫొటోలు, పెట్స్‌కు సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్ పోస్ట్‌లతో నిత్యం అభిమానులను అలరిస్తూనే ఉంటుంది సామ్. ఇటీవట ఓ ఛాలెంజ్‌ను స్వీకరించమని సామ్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సవాలు విసిరాడు. దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది.తర్వాత ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేసింది. ‘నాకు సవాలు విసిరినందుకు ధన్యవాదాలు టైగర్ ష్రాఫ్. ఇదిగో ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేస్తున్నా.చూద్దాం మీరు ఎలా చేస్తారో.’ అని రాస్తూ ఇన్‌స్టా వేదికగా తన వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్‌కు ‘నేను కచ్చితంగా ఇలా చేయలేను’ అని అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు.
ప్రస్తుతం సమంత వరుణ్ ధావన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో అక్షయ్ కుమార్‌తో కూడా సినిమా చేయనుందట. ఇలా వరుసగా బాలీవుడ్ లో సినిమాలు ప్లాన్ చేసుకుంటోంది సమంత.ఈ క్రమంలో సమంత ముంబైలో రెండు సీ ఫేసింగ్ ఫ్లాట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలో ఒక దానిని సమంత కొనబోతోందట. ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు ఫ్లాట్స్ ఇంకా కంట్రక్షన్స్ జరుగుతున్నాయట. సమంత ప్లానింగ్ చూసి అందరు స్టన్ అవుతున్నారు.