సమంత పాన్ ఇండియా సినిమా – అక్కినేని కోడలా మజాకా ..!

సమంత లేటెస్ట్ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇది సర్‌ప్రైజింగ్ న్యూసా.. లేక షాకింగ్ న్యూసా అన్నది తెలియదు గాని. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సమంత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం అవుతున్న ఇప్పటి వరకు స్ట్రైట్ గా ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించలేదు. అవకాశాలు వచ్చాయా లేక హిందీ సీమకి వెల్లడం ఇష్టం లేదా అన్నది తెలియదు గాని టాలీవుడ్ లో సమంత కి ఉన్న క్రేజ్ తో బాలీవుడ్ కి వెళ్ళి ఉంటే గ్యారెంటీగా అక్కడ కూడా స్టార్ హోదాని తెచ్చుకునేది.

కాగా ప్రస్తుతం ది ఫ్యామిలీ మాన్ 2 లో నటించింది సమంత. త్వరలో ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాను డిజాస్టర్ తర్వాత సమంత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఒకే చేయలేదు. చేసిందేదైనా ఉందంటే అది ఫ్యామిలీ మాన్ 2 మాత్రమే. అందుకే సమంత అభిమానులు ఈ వెబ్ సిరీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక సమంత ఫస్ట్ టైం ఒక నెగిటివ్ రోల్ లో కనిపిస్తోంది. అంతేకాదు చిన్మయిని కాదని తన పాత్రకి తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది సమంత. ఈ పాటికే స్ట్రీమింగ్ కావాల్సిన ఫ్యామిలీ మాన్ 2 వీఎఫెక్స్ వర్క్ పెండింగ్ వల్ల పోస్ట్ పోయింది.

ఇక రీసెంట్ గా గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న శాకుంతలం సినిమాలో సమంత నటించబోతున్నట్టు అధికారకంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే తాజా ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందబోతుందని సమంత ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా శాకుంతలం తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా శాకుంతలం పాన్ ఇండియన్ సినిమాగా రూపొందితే మాత్రం ఖచ్చితంగా బహుభాషా చిత్రంగా రిలీజ్ అవుతుంది. కనీసం నాలుగు భాషల్లో అయినా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.