ఎన్టీఆర్ సినిమా నుండి సమంత ఔట్… కారణం అదేనా?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోలను నటించే అవకాశాలు అందుకొని సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత తన జోరుని మరింత పెంచింది. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాట ద్వారా ఈ అమ్మడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తోంది. హిందీలో అవకాశాలు ఎక్కువగా రావటంతో హైదరాబాద్ నుండి ముంబైకి తన మఖాం మార్చేసింది.

ఇదిలా ఉండగా ఇటీవల సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ నటించబోయే సినిమా మీద మరింత దృష్టి పెట్టాడు. అందువల్ల ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూ వస్తుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను నటించబోయే సినిమా స్క్రిప్ట్, సన్నివేశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. హీరోయిన్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ఎన్టీఆర్ 30 సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని కొరటాల శివ భావించినట్లు తెలుస్తోంది. గతంలో కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా సమంత నటించింది. ఇక ఎన్టీఆర్ 30 సినిమాలో సమంతని హీరోయిన్ గా సెలెక్ట్ చేసి ఈ సినిమాలో సమంత పాత్రకి కొరటాల రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న సమంత రెమ్యూనరేషన్ విషయంలో మరింత డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం సమంత ఏకంగా నాడు నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. అందువల్ల రెమ్యూనరేషన్ కారణంగా ఈ సినిమాలో నటించే అవకాశాన్ని సమంత వదులుకున్నట్లు సమాచారం.