Vijay sethupathi : కన్మణి రాంబో ఖతీజా గా విజయ్ సేతుపతి సినిమా…నయనతార సమంతలతో నవ్వించడానికి సిద్ధం…!

Vijay Sethupathi: సమంత దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో ఒకరు పెళ్లి తర్వాత ఆలోచించి కథా పరమైన సినిమాలు చేస్తున్న సమంత చైతూ తో విడాకుల తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది.అటు నార్త్ ఇటు సౌత్ ను కలుపుతూ ఏకంగా హాలీవుడ్ వైపు కూడా చూస్తోంది. వరుస ప్రాజెక్టులతో మిగతా హీరోయిన్ లకు చమటలు పట్టిస్తోంది. పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోదర షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకో ప్రాజెక్ట్ కి ఒక చేసింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించనుంది సామ్. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ లో నటించనుంది.

ఇక తమిళంలో నయనతార విజయ్ సేతుపతి తో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్‌’ అనే సినిమాతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు విగ్నేష్ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఏప్రిల్‌ 28న ఈ కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందన్న విషయాన్ని సమంత సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని హామీ ఇచ్చారు. తెలుగులో ఈ చిత్రాన్ని ”కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేయబోతున్నారు.