Samantha: ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలకి కి సిద్ధం అయ్యింది పుష్ప సినిమా.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, గ్లామరస్ డాల్ రష్మిక మందాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొన్నాయి. సినిమా ఎలా ఉన్నా సమంత చేసిన సిజిలింగ్ సాంగ్…ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ సాంగ్ మాత్రం సోషల్ మీడియాని ఉలిక్కిపడేలా చేసింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని దుమ్మురేపి దంచికొట్టింది. అయితే ఈ పాటపై ఇప్పుడు తాజాగా ఒక వివాదం నెలకొంది. సమంత పైన భార్య బాధితుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి..
అల్లు అర్జున్ మొట్ట మొదటిసారి పాన్ ఇండియాగా చేస్తున్న చిత్రం పుష్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు క్రెయేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ సినిమాకి సంబంధించిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని పాటలకి కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సమంత నటించిన ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ సాంగ్ ఏకంగా పెద్ద సంచలనమే సృష్టించింది. డీఎస్పీ సమకూర్చిన ఈ మాస్ బీట్ కు యావత్ యూత్ మొత్తం ఫిదా అవుతుంది. ఇక ఈ పాటను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సాంగ్ పైన అనుకోని వివాదం ఒకటి చుట్టుముట్టింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా.. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె కెరీర్ లో చేసిన మొట్ట మొదటి ఐటమ్ సాంగ్ ఇది. ఈ పాటకి సమంత రెచ్చిపోయి మరి డాన్స్ వేసింది. అయితే ఈ పాట పైన భార్య బాధితుల సంఘం (పురుషులు) కేసుని నమోదు చేసారు. ఈ పాటలోని సాహిత్యం, విజువల్ ఎఫెక్ట్స్ పురుషలని కామాంధులుగా చేసే ప్రయత్నం చేశారని పురుషులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పాటపై ఒక దావా వేశారని వినికిడి. ఈ పాటని పుష్ప సినిమా నుండి తొలగించాలని భార్య భాదితుల సంఘం డిమాండ్ చేసింది.