సమంత రిస్క్ చేస్తోంది.! మళ్ళీ దెబ్బ పడదు కదా.?

ఇటీవలే సమంత ‘మయో సైటిస్’ వ్యాధికి చికిత్స తీసుకుని మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. ఈ క్రమంలో ఫిజిక్ మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఓవర్‌గా వర్కవుట్లు చేస్తోంది. రీసెంట్‌గా అందుకు సంబంధించిన వీడియోలూ ఫోటోలూ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే, ఇంత ఓవర్ డోస్‌లో వర్కవుట్లు చేయడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారట. అయితే, తనను తాను ఫైటర్‌గా అభివర్ణించుకుంటూ రిస్క్ చేసేస్తోంది సమంత. తేడా కొడితే అంతే సంగతి. ఈ సారి పరిణామాలు వేరే లెవల్‌లో వుంటాయని ప్రత్యేకంగా చెప్పాలా.? ఇంకేముంది సమంత పనైపోయిందంటూ ఏ రేంజ్‌లో ట్రోల్స్ చేశారు నిన్నా మొన్నటి వరకూ.

సో, బీ కేర్ ఫుల్ సమంత.! అంటూ స్వీట్ వార్నింగులిస్తున్నారు సమంత అభిమానులు. ఇక, సమంత కెరీర్ విషయానికి వస్తే, హిందీలో సమంత ఓ సినిమా చేస్తోంది. తెలుగులో ‘ఖుషీ’ సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. సమంత నటించిన ‘శాకుంతలం’ త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.