సమంత సిద్ధమే.! విజయ్ దేవకొండ సంగతేంటి.?

సమంత దాదాపుగా కోలుకున్నట్టే.! ‘మయోసైటిస్’ అనే అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. కానీ, ఆమె తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధంగానే వుంది. హిందీలో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోందిప్పుడు సమంత. మరి, ‘ఖుషీ’ సినిమా సంగతేంటి.? వాస్తవానికి, నిర్మాణంలో వున్న ఈ ‘ఖుషీ’ సినిమానే సమంత తొలుత పూర్తి చేయాల్సి వుంది. విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు.

సమంత కారణంగా సినిమా ఆలస్యమవుతోంది. దాంతో, అభిమానులకు హిట్టు బాకీ పడిపోయానంటూ వాపోతున్నాడు విజయ్ దేవరకొండ. కానీ, ఏమీ చేయలేడాయె. ఎందుకంటే సమంత వస్తేగానీ ‘ఖుషీ’ సినిమా ముందుకు నడవదు. రోజులు గడిచే కొద్దీ ఈ ప్రాజెక్టు మీద బజ్ చప్పబడిపోతోంది. ప్రాజెక్ట్ స్టేల్ అయిపోతోందన్న అభిప్రాయమైతే అంతటా వినిపిస్తోంది.

వేరే ప్రాజెక్టు మీదకు వెళ్ళిపో.. అంటూ అభిమానులు ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నా, విజయ్ దేవరకొండ ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా తయారైందేంటి పరిస్థితి.? అంటూ విజయ్ దేవరకొండ తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. రాకూడని కష్టమే వచ్చింది మరి.!