సమంత ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఈమె భయంకరమైన మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇలా సమంత తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఈమె ఎలాంటి సినిమా షూటింగ్లకు హాజరు కాకుండా పూర్తిగా తన సినిమాలన్నింటికీ బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఇకపోతే ఈమె నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత దూరంగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ సైతం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇకపోతే ఈమె ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడంతో సినిమాకు కాస్త మైనస్ అవుతుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత వల్ల ఈ సినిమాకి మైనస్ కాకూడదన్న ఉద్దేశంతో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అయితే సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించబోదని యాంకర్ సుమ ద్వారా రికార్డెడ్ ఇంటర్వ్యూ ద్వారా ఈమె ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా రికార్డెడ్ ఇంటర్వ్యూల ద్వారా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి సమంత సిద్దమైనట్టు సమాచారం. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఈమె సినిమా కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావడంతో సినిమా పట్ల ఈమెకు ఉన్న డెడికేషన్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.