వరుణ్, సమంత.. లిప్ లాక్?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో ఖుషి మూవీ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీని తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ ని చేయనున్న సంగతి తెలిసిందే. దీనికోసం సమంత గట్టిగా వర్క్ అవుట్స్ చేసి పెర్ఫెక్ట్ బాడీ రెడీ చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రియాంకా చోప్రా నటించింది. అదే పాత్రని ఇండియన్ వెర్షన్ లో సమంత చేయబోతోంది. ఇక హీరోగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఈ యంగ్ హీరో చేయబోతున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఇంటరెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటకొచ్చాయి.

సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంతా వరుణ్ ధావన్ తో లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయడానికి ఒకే చెప్పిందంట. ఒరిజినల్ వెర్షన్ లో కూడా ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మధ్య బెడ్ రూమ్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆడియన్స్ కూడా వాటిని రిసీవ్ చేసుకుంటారని భావించి వరుణ్, సమంత మధ్య లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాలు పెట్టాలని డిసైడ్ అయ్యారంట. అయితే సమంత టీమ్ మాత్రం మరీ అంత బోల్డ్ గా ఎమి ఉండవని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

ఏది ఏమైనా సమంత మాత్రం పెళ్లి తర్వాత కాస్తా స్పీడ్ పెంచి బాలీవుడ్ లో సక్సెస్ కావడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకుంటుంది అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సిటాడెల్ తో పాటు హిందీలో ఆయుష్మాన్ ఖురానాతో ఒక హర్రర్ మూవీలో సామ్ నటిస్తోంది. అలాగే ఖుషి మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో హిందీలో రిలీజ్ అవ్వనుంది.

ఇప్పటికే వచ్చిన ఇంగ్లీష్ వెర్షన్ సిటాడెల్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇతర భాషలలో కూడా దీనిని తీసుకొచ్చారు. మరి అదే కథతో ఇండియన్ వెర్షన్ సిటాడెల్ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి దానిని ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.