హీరోలకు ఏమాత్రం తీసుపోని సమంత.. థియేటర్లో ఎదుట భారీ కటౌట్స్?

సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాలో నటించిన హీరో పోస్టర్లు కటౌట్లు పెద్ద ఎత్తున థియేటర్ల ముందు ఏర్పాటుచేసి పాలాభిషేకాలు చేస్తూ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటారు.ఇలా స్టార్ హీరోల సినిమాలు వస్తే సినిమా విడుదలకు 10 రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. ఇలా హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో హీరోయిన్ల కటౌట్లు పెట్టడం మనం ఎక్కడా చూసి ఉండము. కానీ సమంత విషయంలో మాత్రం అందుకు పూర్తి విభిన్నమని చెప్పాలి.

సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే సమంత అభిమానుల సైతం థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున హంగామా మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే హైదరాబాదులో సుదర్శన్ థియేటర్ వద్ద సమంతా భారీ కటౌట్ ఏర్పాటు చేయడంతో సమంతకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

గతంలో సమంత నటించిన ఓ బేబీ సినిమా విడుదల సమయంలో కూడా ఇలాగే భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అయితే తాజాగా యశోద సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల ముందు కటౌట్ ఉండడంతో ఈమె కూడా హీరోలకు పోటీగా క్రేజ్ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత నటించిన మొదటి సినిమా విడుదల కాండడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా సమంత అభిమానులకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో వేచి చూడాలి.