‘ఖుషి’ సినిమా విషయంలో సమంత ఫుల్ హ్యాపీగా వుందట. ఎంతో కొంత ఈ సినిమా సమంతకి బాగానే వర్కవుట్ అయ్యిందంటున్నారు.
ఇంతకు ముందు వరకూ తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా.. ఈ సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందట సమంత. విజయ్ దేవరకొండ మాత్రం సినిమా విషయంలో అంత సంతృప్తికరంగా లేడు.
పాజిటివ్ టాక్ తీసుకొచ్చే క్రమంలో సినిమా కోసం చాలా చాలా ఖర్చు చేసేశాడు. అంతేకాదు.. ఇటీవలే వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు పంచి పెట్టేశాడు సాయం రూపంలో.
సో, అలా ఫైనల్‌గా లెక్క తేల్చుకుంటే విజయ్ దేవరకొండకి పెద్ద రేంజ్‌లోనే బొక్క పడిందని అంటున్నారు. ఈ నష్టాన్ని విజయ్ తీర్చుకోలేకపోతున్నాడట.
ఇదిలా వుంటే, బయర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైపోయిందట. అటు నిర్మాతకీ, ఇటు విజయ్ దేవరకొండకీ.. కూడా బయ్యర్ల నుంచి టార్చర్ మొదలైందట. ఫస్ట్ డే టాక్ అయితే పాజిటివ్‌గా తీసుకొచ్చాడు కానీ తన పీఆర్ మ్యాజిక్‌తో విజయ్.
సినిమాని సక్సెస్ లిస్టులో వుంచలేకపోయాడు. మంచి వసూళ్లు రాబట్టిన సినిమాగా తేల్చలేకపోయాడు. దాంతో, మళ్లీ విజయ్ దేవరకొండ పరిస్థితి మొదటికొచ్చినట్లయ్యింది. ‘ఖుషి’ సినిమా చేయకుండా వున్నా బాగుండేదేమో అనుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.