Samantha : శాకుంతలం కోసం సొంత గొంతు…. సినిమాపై అంచనాలు పెంచిన సామ్….!

Samantha : సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. యశోద సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఇక ఈ సినిమాను ఆగష్టు లో విడుదలకు సిద్ధం చేసారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను తెలుగు తమిళ, కన్నడ, హిందీ,మలయాళం భాషలలో విడుదలకు సిద్ధం చేసారు. ఇక మరో పాన్ ఇండియా సినిమా శాకుంతలం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది.

ఇక సమంత తమిళ హీరో విజయ్ సేతుపతి, నయన తార కలిసి కన్మని రాంబో ఖాతిజ సినిమాలో నటించింది. ఈ సినిమాకూడా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇక సమంత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి అమెరికన్ వెబ్ సిరీస్ సిటా డెల్ లో నటిస్తోంది. ఇక అమ్మడి చేతిలో హాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం.

ఇక లేటెస్ట్ గా శాకుంతలం సినిమా కోసం సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ సినిమాని గుణ టీమ్‌వర్క్స్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించారు.