సినిమాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న సమంత… షాక్ లో అభిమానులు!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్ఛ జీవిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈమె తనకు నచ్చిన విధంగా తన జీవితాన్ని గడపడమే కాకుండా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు యశోద ఖుషి వాటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. పూర్తిగా గ్లామర్ దుస్తులను ధరించడమే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇలా తన ఇష్టం వచ్చిన విధంగా తన జీవితాన్ని గడుపుతున్న సమంత ఇకపై తన సినిమాల విషయంలో కాస్త కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంత తన సినిమాల పట్ల మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

ఈ క్రమంలోనే సమంత ఇకపై నటించే సినిమాల విషయంలో భారీ కండిషన్స్ పెట్టబోతున్నారు.ఈమె సినిమాలలో నటించాలంటే సినిమాలలో ఎలాంటి గ్లామర్ రోల్స్ లేకుండా ఉండడమే కాకుండా లిప్ లాక్ సన్ని వేషాలు ఎక్స్పోజింగ్ చేయడానికి ఇష్టపడటం లేదని ఇలాంటి కండిషన్స్ కి ఒప్పుకుంటేనే తాను సినిమాకి సైన్ చేస్తారని తెలుస్తోంది. ఇలా ఉన్నపలంగా సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా అభిమానులు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.