Home TV SHOWS చిరంజీవిను అడగాల్సిన ప్రశ్నే అది.. సమంత మామూల్ది కాదు!

చిరంజీవిను అడగాల్సిన ప్రశ్నే అది.. సమంత మామూల్ది కాదు!

మెగాస్టార్ చిరంజీవి సమంత కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిరు సమంత కాంబో అంటే వెండితెరపై కాదండి. సమంత సామ్ జామ్ షో కోసం చిరంజీవి ఆల్రెడీ వచ్చాడు. షూటింగ్ కూడా జరిగిపోయింది. కానీ ఎపిసోడ్ మాత్రం ఇంకా రావడం లేదు. ఆ ఎపిసోడ్ కోసమే మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలా సమంత చిరంజీవి కలిసి ఏ విధంగా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు.

ఇప్పటికే సమంత తన టాక్ షోలో విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్, రకుల్, క్రిష్, తమన్నా, సైనా నెహ్వాల్ దంపతులు హాజరయ్యారు. ఎన్నో విషయాలను బయట పెట్టేశారు. ఇంత వరకు ఎక్కడా బయటపెట్టని, నోరు విప్పని ఘటనలపై మాట్లాడారు. అలా చిరంజీవి చేసే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తుండగా.. తాజాగా ఓ అప్డేడ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుందని తెలిపారు.

Samantha Funny Question To Chiranjeevi In Sam Jam
Samantha funny question to Chiranjeevi In Sam Jam

అయితే అందులో భాగంగా ఓ చిన్న ప్రోమోను వదిలారు. ఇందులో సమంత అసలైన ప్రశ్నను అడిగింది. చిరంజీవికి వంటలంటే ఎంతో ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లాక్డౌన్‌లో చిరు ఎంతో రుచి కరమైన వంటలను వండాడు. అందుకే సమంత వాటికి సంబంధించిన ప్రశ్ననే సంధించినట్టుంది. మీ ఇంట్లో ఫ్రిడ్జ్‌లో కచ్చితంగా ఉండే ఐటెం ఏంటని సమంత అడగడంతో చిరు.. మందు అనుకుంటున్నావా? అంటూ పెగ్గు వేస్తోన్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు. మీరు అనుకునేది ఉండదు అంటూ చిరు కౌంటర్ వేశాడు.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News