బాడీ స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్లిపోయింది.. తన వ్యాధి గురించి వివరించిన సమంత!

ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొని సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె నటించిన సిటాడెలా హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సమంత నిత్యం ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. నిన్న కాక మొన్న ఎక్స్ పై ఎక్కువగా ఖర్చు పెట్టాను అంటూ ఒకసారి, తన వెడ్డింగ్ గౌన్ రీ క్రియేట్ చేస్తూ మరొకసారి ట్రోల్స్ కి గురైంది.

అయినా అలాంటి ట్రోలింగ్స్ ని పెద్దగా పట్టించుకోని సమంత కొన్ని విషయాల పట్ల ఘాటుగా స్పందిస్తుంది, తన ప్రైవసీని డిస్టర్బ్ చేయవద్దు అని హెచ్చరిస్తుంది. బాధ్యతారాహిత్యమైన వార్తలని రాయొద్దని మీడియాని కోరింది. అలాగే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత అనేక విషయాలను ప్రస్తావిస్తూ తన వ్యాధి గురించి కూడా మాట్లాడింది.

అక్షయ్ కుమార్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడే కాస్తంత నీరసంగా అనిపించింది, ఓపిక లేకపోయినా ఆ షో ని పూర్తి చేసి వెంటనే హైదరాబాద్ వచ్చేసాను. తరువాత రోజు ఖుషి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నాను. షూటింగ్ సమయంలో కూడా బాగా నీరసంగా అనిపించిందని శరీరం షట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయిందని అప్పటినుంచి ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టిందని చెప్పిన సమంత అది మయోసైటిస్ అనే వ్యాధి అని గుర్తించడానికి చాలా సమయం పట్టింది.

ఆ తర్వాత ఆ వ్యాధితో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అందరికీ తెలిసిందే అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి కారణంగా తాను ఏడాదిన్నర సమయం సినిమాలకి దూరంగా ఉన్నానని, అప్పటికే నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసానని చెప్పుకొచ్చింది సమంత. ట్రూలాలా అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఆ బ్యానర్ పై తెలుగులో మా ఇంటి బంగారం అనే పేరుతో హీరోయిన్ సినిమా చేస్తుంది సమంత.