టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా భయంకరమైనటువంటి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత పూర్తిగా తన సినిమాలకు విరామం ప్రకటించి మెరుగైన చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి సమంత త్వరగా కోలుకోవాలని ఎంతోమంది సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆకాంక్షించారు. ఇక ఈమెకు అనారోగ్య సమస్యలు అధికమవడంతో సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నట్టు సమాచారం.
సమంత చివరిగా నటించిన చిత్రం యశోద. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సమంత పూర్తి చేసి విడుదల చేశారు.ఈ సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుంది.ఈ సినిమా తర్వాత సమంత ఇతర సినిమాలలో నటించాల్సి ఉండగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు విరామం ప్రకటించారు. ఇకపోతే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు వరుసగా బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. అయితే తన అనారోగ్య సమస్య కారణంగా ఈ బాలీవుడ్ ప్రాజెక్టులు అన్నీ కూడా వదులుకున్నట్టు సమాచారం.
ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగ్ పనులు జరుపుకొని ఉంటే ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే విడుదల అయ్యేది.సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది అయితే ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి కావడంతో సమంత కొంత విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారట. ఈ సినిమా అనంతరం సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.