సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో పోస్టులు పెడుతూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది నటి సమంత. తన అందం అభినయంతోనే కాకుండా వ్యక్తిగత క్యారెక్టర్ తో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సమంత ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.
తాజాగా ఆమె తనకు ఇష్టమైన ఒక ఇంగ్లీష్ పద్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మిమ్మల్ని అందరూ నిందిస్తున్నప్పుడు మీరు తలెత్తుకొని నిలబడితే, మగాళ్ళందరూ మిమ్మల్ని అవమానించినప్పుడు మిమ్మల్ని మీరు నమ్మితే అంటూ సాగే ఒక పద్యాన్ని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ పద్యం తనలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతూ ఉంటుందని చెప్పింది. విజయాలన్నింటినీ పక్కనపెట్టి ఒకసారి రిస్క్ చేసినప్పుడు అక్కడ ఓడిపోతే మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి.
ఆ ఓటమి గురించి ఆలోచించుకుంటూ కూర్చోకూడదు, మీ హృదయాన్ని కఠినంగా మార్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్లాలి, మీ దగ్గర ఏమీ లేనప్పుడు సంకల్పం అనేదాన్ని గట్టిగా పట్టుకొని కదలండి అప్పుడు మనల్ని నిందించే వారికి సరైన సమాధానం చెప్పవచ్చు అంటూ సాగింది సమంత పోస్ట్ చేసిన పద్యం. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సమంతకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో సమంత యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అందులోనే ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరే వివరాలు ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే వీటి గురించిన వివరాలు వెల్లడిస్తారని సమాచారం.