Samantha : విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ లవ్ స్టోరీ… రెమ్యూనరేషన్ పెంచేసిన సామ్..!

Samantha : విడాకుల తర్వాత సినిమాల జోరు పెంచింది సామ్. అన్ని భాషలలోనూ నటిస్తూ అలాగే హాలీవుడ్ చిత్రాలను కూడా చేస్తోంది సామ్. ఇపుడు విజయ్ దేవరకొండతో మరీ సినిమా చేయబోతోంది. మహానటి తర్వాత మరోసారి ఈ జంట కలిసి నటించబోతోంది.ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ గా తీస్తున్నారు. ఇక ఇందులో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు.ఈ సినిమా కోసం 3కోట్లు డిమాండ్ చేస్తోందట సమంత.

ప్రస్తుతం సమంత మైథలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’లో కూడా నటిస్తోంది. ఇప్పటికే సమంత ‘శాకుంతలం’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్‌ సినిమా కూడా చేస్తోంది. ఇక రీసెంట్ గా శాకుంతలం సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో సమంత ప్రకృతిలో, వన్యప్రాణుల మధ్య సేద తీరుతూ అచ్చం దేవకన్యలా కనిపించింది. పురాణాల్లో దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమ, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం లాంటి అంశాలతో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను కూడా ధరించింది. అలాగే మేకప్ కోసం కూడా సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మరీ మేకప్ వేయించుకుంది. అందుకే సామ్, తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది. పైగా ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక విజయ్ తో సినిమా షూటింగ్‌ ను ఏప్రిల్‌ లో స్టార్ట్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మొత్తానికి సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ పోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా సామ్ మరో సినిమా చేస్తుండేసరికి మొత్తానికి మళ్ళీ సామ్ ఫామ్ లోకి వస్తోంది అని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.