‘ఖుషీ’ ప్రమోషన్‌లో సమంత జోష్‌.. సినిమాకు హైప్‌ క్రియేట్‌

సోషల్‌ మీడియాలో ఇప్పుడంతా సమంత పేరే ట్రెండింగ్ అవుతోంది. అందుకు కారణం.. ఖుషీ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ ఆమె చేసిన ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌. కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె.. ఈ ఈవెంట్లో మాత్రం ఎంతో ఎనర్జటిక్‌ గా, ఛార్మింగ్‌ లుక్‌తో కనిపించి ఆకట్టుకుంది. ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌, లుక్స్‌, విజయ్‌ దేవరకొండతో డ్యాన్స్‌, స్పీచ్‌.. అన్నీ ఈ ఈవెంట్‌ కు హైలైట్‌ గా నిలిచాయి. అసలీ ఈవెంట్‌ కోసం ఆమె గంటల వ్యవధిలో మూడు కాస్ట్యూమ్స్‌ ఛేంజ్‌ చేసి మరీ సర్‌ ప్రైజ్‌ చేసింది. మొదట బ్లాక్‌ బ్రాలెట్‌లో సందడి చేసిన సమంత.. తర్వాత స్టేజ్‌ పై లైవ్‌ పర్ఫార్మెన్స్‌ కోసం లెహెంగాలో కనిపించి ఆకట్టుకుంది. అనంతరం మెరూన్‌ కలర్‌ స్లీవ్‌ లెస్‌ చీరలో మెస్మరైంజిగ్‌ గా కనిపించి ఈవెంట్‌కే స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచింది. ఈ ఈవెంట్‌ లో ఆమె పెరఫార్మెన్స్‌ చూశాక.. ఆ బ్రేక్‌ వల్ల ఆమె ఆరోగ్యం కాస్త గాడిలో పడినట్టుందని అనుకుంటున్నారు.

ఈవెంట్‌ చివర్లో అభిమానుల అరుపులు, కేకలు చూసిన సంతోషపడిపోయిన ఆమె.. మీ కోసమే హార్డ్‌ వర్క్‌ చేస్తున్నాను త్వరలోనే తిరిగొస్తా గట్టి బ్లాక్‌ బస్టర్‌ కొడతాను అంటూ కాస్త ఎమోషనల్‌ గా మాట్లాడింది. దీంతో అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంగా తయారవ్వాలని ప్రార్థిస్తున్నారు. లైగర్‌ వంటి డిజాస్టర్‌ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్‌తో విజయ్‌ దేవరకొండ ఖుషీ రిలీజవుతుంది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. పాటల, ట్రైలర్‌లు గట్రా సినిమాపై మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. మైత్రీ సైతం ప్రమోషన్లు వీర లెవల్లో ప్లాన్‌ చేస్తుంది.

ఈ సినిమా మ్యూజికల్‌ కాన్సర్ట్‌ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా విజయ్‌, సమంత లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఓ హై ఇచ్చింది. లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ముందే ఉంటుందని తెలిసినా.. ఆ రేంజ్‌లో ఉంటుందని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చేయలేరు. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌లలా విజయ్‌, సమంతలు గాల్లో ఎగరటాలు, విజయ్‌ సమంతను ఎత్తుకుని గిరగిర తిప్పటాలు, మొత్తంగా వీళ్ల మధ్య కెమిస్టీ చూడటానికి రెండు కళ్లు చాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు సినిమాపై ఉన్న క్రేజ్‌ ఈ మ్యూజికల్‌ కాన్సర్ట్‌తో రెండింతలైంది.