డాక్టర్ సహాయంతో యశోద డబ్బింగ్ పూర్తి చేసిన సమంత.. డెడికేషన్ అంటే ఇది కదా?

సమంత ప్రస్తుత అనారోగ్య సమస్యతో బాధపడడంతో తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉండి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇలా ఈమెకు అనారోగ్య సమస్యలు రావడంతో సినిమాలకు దూరంగా ఉండటమే కాకుండా నవంబర్ 11వ తేదీ విడుదల కాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. సమంత విడాకులు తీసుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఈ సినిమా విడుదల అవుతున్నప్పటికీ సమంత అనారోగ్యం కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే యశోద సినిమా నిర్మాత శివలెంఖ కృష్ణ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన యశోద సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమా కథ వినగానే ఈ సినిమాకు సరైన కథానాయక సమంతా మాత్రమే అనిపించింది. అందుకే తనని సంప్రదించి సినిమా గురించి వివరించగా ఆమె ఏమాత్రం ఆలోచించకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నిర్మాత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఈ సినిమా సరోగసి ముసుగులో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిందని తెలియజేశారు.

సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమాకు ఆమె లోటు కనిపించలేదా అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు నిర్మాత సమాధానం చెబుతూ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాతనే సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారనే విషయం మాకు తెలిసిందని ఈయన తెలిపారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని డబ్బింగ్ సమయంలో ఆమె ఎంతో ఇబ్బంది పడ్డారని నిర్మాత పేర్కొన్నారు.అయితే సమంత తెలుగులో డబ్బింగ్ పూర్తి చేసినప్పటికీ హిందీలో చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించాము.ఇక తమిళంలో కూడా ఇతరులచే డబ్బింగ్ చెప్పిస్తామని చెప్పినప్పటికీ సమంత మాత్రం డాక్టర్ ను పక్కన పెట్టుకొని మరి డబ్బింగ్ పూర్తి చేసిందని నిర్మాత తెలియచేయడంతో సినిమాల పట్ల సమంతకు ఉన్న డెడికేషన్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.