ఆదివారం అంటే అందరికీ మక్కువే. వారం అంతా పని చేసి ఆ ఒక్క రోజు సంతోషంగా హాయిగా ఏ చీకూ చింతా లేకుండా గడపాలని భావిస్తారు. సెలెబ్రిటీలైనా సరే వీకెండ్, ఆదివారం వస్తే సపరేట్ ప్లానింగ్స్ ఉంటాయి. రొటీన్ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుని ఎంజాయ్ చేయాలని భావిస్తారు. ఆక్రమంలో సమంత కూడా ఈ ఆదివార మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకుందట. కానీ తీరా చూస్తే అవన్నీ కలలుగానే మిగిలిపోయాట.
ప్రస్తుతం సమంత ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఓ వైపు అర్భన్ ఫార్మింగ్ అంటూ ఇంటి డాబా మీదే కూరగాయలు పండించేస్తోంది. ఆరోగ్యానికి కాపాడుకోవడానికి సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వాడుతోంది. ఈ క్రమంలో లాక్ డౌన్‌లోనే సమంత మోడ్రన్ రైతుగా మారిపోయింది. ఇక మరో వైపు తన చిన్ననాటి కల.. అయితే ఫ్యాషన్ డిజైనింగ్‌లో సొంత బ్రాండ్ కోసం నిర్విరామంగా పని చేస్తోంది.
సాకీ వరల్డ్ పేరిట తన బ్రాండ్ డిజైనర్ దుస్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంకో వైపు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ డబ్బింగ్ కూడా పూర్తి చేసేసింది. ఇన్ని పనుల మధ్య ఆదివారం కాస్త ప్రశాంతంగా టబ్ బాత్ చేస్తూ చేతిలో మందు పట్టుకుని అలా ఎంజాయ్ చేద్దామని అనుకుందట కానీ.. చివరకు తన పెట్ చేసిన పనికి అన్నీ తారుమారు అయ్యాయట. దాన్ని చూసుకోవడానికే సమయం సరిపోలేదట. పాపం సమంత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.