ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ర్యాకింగ్ గోల నడుస్తోంది. హీరోల విషయంలో అయితే అది ఎప్పుడూ వివాదాస్పదమే అవుతంది. కానీ ఈ మధ్య హీరోయిన్లలో నెంబర్ వన్ ఎవరు.. లేడీ సూపర్ స్టార్ ఎవరు అని చర్చలు పెడుతున్నారు. అయితే ఈ సౌత్ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కు చాలా మంది పోటీ పడుతున్నారు. అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్ వంటి వారు టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నారు.
అయితే అందరూ నయనతారను లేడీ సూపర్ స్టార్‌గా అంగీకరించారు. ఆ స్థానాన్ని ఆమెకు కట్టబెట్టారు. అయితే సమంత కూడా ఆ స్థానానికి అర్హురాలేనని నిరూపించుకుంది. అందుకే సమంత, నయనతార మధ్య ఓ కోల్డ్ వార్ నడుస్తుందని అందరూ భావిస్తారు. ఈ అపోహను తొలిగించేందుకునే నయన్ ప్రియుడు అదిరిపోయే ప్లాన్ వేశాడు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత మల్టీ స్టారర్ చిత్రాన్ని చేసేందుకు రెడీ అయ్యాడు.
అలా ఈ ఇద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని క్లారిటీ ఇచ్చారు. తాజాగా సమంత నయనతారకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఆ ట్వీట్‌లో నయన్‌పై ఉన్న ప్రేమను సమంత చాటింది. అక్కా అని సంబోధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నయనతార హ్యాపీ బర్త్ డే.. మన కోసం మనం పోరాడాలి.. ఈ విషయం మమ్మల్ని ఇంకా ఇన్‌స్పైర్ చేస్తూనే ఉండాలి.. ఇంకా మెరగువుతూనే ఉండాలి.. నీకు మరింత శక్తి రావాలి సిస్టర్.. నీ బలానికి, నీ పట్టుదలకు సెల్యూట్ అని సమంత ట్వీట్ చేసింది.