సమంత జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. పెట్స్‌ను పెంచుకోవడమంటే సమంతకు చాలా ఇష్టం. సమంత ఇంట్లో ఇప్పుడు పెట్స్ ఎంత రచ్చ చేస్తాయో అందరికీ తెలిసిందే. వాటితో కలిసి సమంత చేసే ఫన్ అంతా ఇంతా కాదు. ఆ మధ్య తన పెట్‌కు స్కిన్ ఎలర్జీ రావడంతో ఎంతో కంగారు పడింది. ఎంత మంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. చివరకు నెటిజన్ల సలహాలను అడిగింది.
సమంత బాధను గుర్తించిన నెటిజన్లు తమకు తెలిసిన పద్దతులను వివరించారు. చివరకు తన పెట్‌కు స్కిన్ ఎలర్జీ తగ్గిపోయిందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలా తన పెంపుడు కుక్కకు బాగా లేకపోతేనే తల్లడిల్లిపోయింది సమంత. దీన్ని బట్టే సమంత మనసు ఎంత మంచిదో అర్థం చేసుకోవచ్చు. సమంత తాజాగా ఓ వీడియోను చూసి ఫుల్ ఖుషీ అవుతోన్నట్టు కనిపిస్తోంది. అందులో ఉన్న పిల్లి చేసిన విన్యాసాలకు సమంత పడి పడి నవ్వినట్టుంది.
మ్యూజిక్‌కు తగ్గట్టు పిల్లి మూమెంట్స్ ఇవ్వడం, దరువు ఎంత స్పీడ్‌గా వేస్తుంటే.. పిల్ల తన తలతో మూమెంట్స్ ఇస్తూ డ్యాన్సులు చేసిన వీడియోను సమంత షేర్ చేసింది. ఇంటర్నెట్‌లో ఈ రోజు ఇది బెస్ట్ వీడియో అంటూ కితాబిచ్చేసింది. ఇప్పటికే పది సార్లు చూశానని సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత ఈ వీడియోను చూసి తెగ సంబరపడిపోతోంది. ప్రస్తుతం సాకీ వరల్డ్ ప్రమోట్ చేసే బిజీలో ఉంది.