లేవండి ఇక కదలండి.. సమంత రచ్చ మళ్లీ షురూ!!

Samantha Akkineni Return to Gym To Get Fit

టాలీవుడ్‌లో సమంతకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే సమంత ఒక కొత్త శకాన్ని ప్రారంభించినట్టు. హీరోయిన్లకు పెళ్లైతే ఆఫర్స్ రావు.. వేషాలు ఇవ్వరు.. కెరీర్ ముగిసినట్టే అనే ఓ అపోహ ఉండేది. కానీ సమంత ఆ పద్దతిని, ఆ ఆలోచనలను పూర్తి రూపుమాపింది. పెళ్లికి ముందున్న దానికంటే ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహం, ఆఫర్లు, సక్సెస్‌లతో దూసుకుపోతోంది. పెళ్లి తరువాతే సమంత కెరీర్ మరో స్థాయికి వెళ్లింది. అయితే సమంత సక్సెస్‌ల వెనుక ఎంతో కష్టం దాగుంది.

Samantha Akkineni Return to Gym To Get Fit
Samantha Akkineni Return to Gym To Get Fit

సమంత తన ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు ఎంతో శ్రమిస్తూ ఉంటుంది. జిమ్‌లో చెమటోడుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మామ నాగ్, భర్త చైతో పోటీ పడుతూ మరీ వర్కౌట్లు చేస్తుంది. వారు ఎంత బరువులు ఎత్తితే తాను అంతే ఎత్తేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ మధ్య ఏకంగా వంద కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించింది. ఇక సమంత ఇచ్చిన ప్రోత్సాహమో ఏమో గానీ అమల కూడా కొన్ని రోజులు జిమ్‌లో ప్రత్యక్షమైంది.

గత కొన్ని రోజులుగా సమంత తన పనులతో బిజీగా ఉండటం వల్ల జిమ్‌లోకి అడుగుపెట్టలేదేమో. ఇక మళ్లీ తన కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అసలే మళ్లీ ఉపాసనతో కలిసి ఓ ప్రోగ్రాం కూడా ప్లాన్ చేసినట్టుంది. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించిన ఉపాసన.. మొదటి గెస్ట్‌గా సమంతను ఆహ్వానించి కొన్ని చిట్కాలు చెప్పించినట్టు కనిపిస్తోంది. ఇక సమంత జిమ్‌లో నేడు అడుగుపెట్టినట్టుంది. ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జిమ్‌లోని సీక్రెట్స్ చెప్పినట్టు కనిపిస్తోంది. ఊరికే ఖాళీగా కూర్చుంటే కుదరరు.. లేవండి.. ఇక కదలండి.. ఫిట్‌గా ఉండటానికి వర్కౌట్లు చేయండంటూ జిమ్‌లో వర్కౌట్లతో రచ్చ చేసేట్టు కనిపిస్తోంది.