అడిగినవన్నీ చూపించేస్తోంది.. సమంత మామూల్ది కాదు!!

Samantha Akkineni Pics Trend Goes viral

సమంత తాజాగా సోషల్ మీడియాలో కొత్త పంథాకు తెరదీసింది. కొత్త ట్రెండ్‌ను ట్రై చేద్దామని చెబుతూ రచ్చ రచ్చ చేస్తోంది. మామూలుగానే సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అలాంటి సమంత తాజాగా ఫోటోలతో ఆట ఆడటం మొదలుపెట్టింది. ఎలాంటి ఫోటోను అయినా అడగండి.. నేను పోస్ట్ చేస్తాను అంటూ సమంత ఓ ఫన్నీ సెషన్‌ను మొదలుపెట్టింది.

ఇక ఇలాంటి గోల్డెన్ ఆఫర్ ఇస్తే జనాలు ఊరుకుంటారా ఏంటి? సమంత పెట్టిన కాంటేషన్ చాలా బాగానే క్లిక్ అయింది. సమంత ఫాలోవర్లు, ఫ్యాన్స్ రకరకాలు ఫోటోలను అడిగారు. వాటన్నంటిని కూడా సమంత పెట్టేసింది. ఇందులోని ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. సమంతలోని విభిన్న కోణాలు, అన్నీ మూడ్‌లకు సంబంధించిన ఫోటోలను పెట్టమని నెటిజన్లు కోరారు. వాటికి ఏ మాత్రం జంకకుండా అన్ని ఫోటోలను షేర్ చేసింది.

Samantha Akkineni Pics Trend Goes viral
Samantha Akkineni Pics Trend Goes viral

నవ్వినప్పుడు ఎలా ఉంటావ్? కోపం వస్తే ఎలా ఉంటావ్? మేకప్ లేకపోతే ఎలా ఉంటావ్? అంటూ రకరకాలుగా ఫోటోలను పంపించమని అడిగారు. అలా అన్ని రకాల ఫోటోలను సమంత షేర్ చేసింది. గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఫోటో ఏంటి అంటే.. పెళ్లి ఫోటోను షేర్ చేసింది. నాగ చైతన్య, నాగార్జునతో ఇటీవలె దిగిన ఫోటోలను పంపమని అడిగారు. ఇంకొందరు హష్‌తో దిగిన ఫోటోలను అడిగారు. మొత్తానికి సమంత మాత్రం ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/2470481438553569674/