తెగ కష్టపడుతోంది.. సమంత వర్కవుట్లు వైరల్

Samantha Akkineni Night workout Virla

సమంత తన ఫిట్ నెస్‌కు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో అందరికీ తెలిసిందే. వర్కవుట్లు చేయనిదో రోజును మొదలుపెట్టదు. ఒక వేళ ఉదయం చేసేందుకు కుదరకపోయినా రాత్రి అయినా సరే వర్కవుట్లు చేస్తుంది. అలా క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తూ సమంత ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. అయితే అక్కినేని ఇంట్లో ఓ రకమైన పోటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంరదూ ఫిట్ నెస్ మంత్రను జపించేవారే ఫ్యామిలీలో ఉన్నారు.

Samantha Akkineni Night workout Virla
Samantha Akkineni Night workout Virla

సమంత, నాగ చైతన్య, నాగార్జున ఇలా అందరూ కూడా ఫిట్ నెస్ కోసం ప్రాణమిస్తారు. ఇక వీరిని చూసి అమల కూడా వ్యాయామం చేయడం ప్రారంభించింది. అత్తాకోడళ్లు మామఇలా అందరూ కలిసి జిమ్ చేస్తుంటారు. బరువులు ఎత్తడంలోనూ పోటీలు పెట్టుకుంటారు. ఆ మధ్య సమంత వంద కేజీల బరువును ఎత్తడంతో అందరూ ఫిదా అయ్యారు. అలా సమంత తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వస్తోంది.

మొన్నటి వరకు సమంత ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది సమంత. ఇప్పుడు నయనతార విఘ్నేశ్ శివన్ కాంబోలో వస్తోన్న సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. అయితే సమంత మళ్లీ ఇప్పుడు జిమ్‌లో తెగ కష్టపడుతోంది. నిన్న రాత్రి వ్యాయామం చేశాకే షూటింగ్‌లో పాల్గొన్నట్టుంది. అర్దరాత్రి దాటాకే ఆ మూవీ షూటింగ్ జరిగినట్టుంది. మొత్తానికి సమంత ఫుల్ బిజీగానే ఉంటోంది.