టాలీవుడ్ క్వీన్ లేడీ సూపర్ స్టార్ ఇలా ఎన్ని ట్యాగులు ఇచ్చినా దానికి సమంత అర్హురాలే. సహజంగా హీరోయిన్లకు పెళ్లి అయితే సినిమాలకు పనికిరారని, తెరపై మళ్లీ అందంగా కనిపించరు.. హీరోయిన్ పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసినట్టే అని అందరూ అనుకుంటారు. అదే పద్దతి కొనసాగింది. కానీ సమంత వాటిని చెరిపేసింది. తాను ఓ కొత్త సూత్రం రచించింది. ఎవ్వరూ కూడా ఎవ్వరినీ ఎప్పుడూ ఆపలేరని తెలిపింది. పెళ్లి తరువాతే సమంత కెరీర్ యూటర్న్ తిరిగింది. మునుపటి కంటే ఎక్కువ స్టార్డంను తెచ్చుకుంది.
పెళ్లి తరువాత సమంత సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే పెళ్లి తరువాత మాత్రం ఓ విషయంలో సమంత మారింది. బికినీ వేసుకోవడం, ఎక్స్‌పోజింగ్ చేయడం, బోల్డ్ క్యారెక్టర్స్‌ను చేయడం మానేసింది. పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అలా సమంత తెరపై పద్దతిగా ఉంటూ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేసింది.
ఆ మధ్య ఒకసారి బికినీ ఫోటోలు షేర్ చేయగా అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు. అంత మంచి పేరున్ను కుటుంబానికి కోడలిగా వెళ్లావ్.. ఇలాంటి చెత్త డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నావ్ అని సమంతను ట్రోల్ చేశారు. ఎలా ఉండాలో మీరు నాకు చెప్పకండని సమంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు సమంత క్లీవేజ్, బికినీ షోతో రచ్చ చేస్తోంది. నాగచైతన్య బర్త్ డేను సెలెబ్రేట్ చేసేందుకు మాల్దీవులకు వెళ్లిన సమంత అందాల ఆరబోతకు తెరదీసింది. బాత్ టబ్‌లో స్నానం చేస్తూ ఓ ఫోటోను దిగింది. అందులో క్లీవేజ్ షోతో నానా రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.