సమంతను ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్

Samantha Akkineni About Her Pet Hash

సమంత జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. సమంత తన పెట్ హష్‌ను తన కొడుకుగా భావిస్తూ ఉంటుంది. మొన్నీ మధ్య హష్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసింది. మై బేబీ బాయ్‌కి రెండేళ్లు నిండాయని సంతోషంగా తెలిపింది. అలా హష్‌తో సమంత ఎంత కనెక్ట్ అయిపోయిందో చెప్పకనే చెప్పేసింది. హష్ చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమంత తన కొడుకులా భావించే హష్ ఏ పనీ కూడా ప్రశాంతంగా చేయనివ్వడు.

Samantha Akkineni About Her Pet Hash
Samantha Akkineni About Her Pet Hash

ప్రతీసారి ఏదో ఒకటి చేస్తూ సమంతను డిస్టర్బ్ చేస్తుంటాడు. అలా ఆ పెట్ లాక్డౌన్‌లో చేసిన అల్లరిని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. డాబాపై అర్భన్ ఫార్మింగ్ చేస్తూ బిజిగా ఉన్న సమయంలో హష్ బాగా సాయం చేసేదని చెప్పుకొచ్చింది. అయితే హష్ మాత్రం ఎప్పుడూ ఫ్రిడ్జ్ డోర్ తీస్తూ అల్లరి చేస్తుంటాడని చెప్పుకొచ్చింది. మళ్లీ మళ్లీ డోర్ వేసుకుంటూ ఉండటంతోనే తనకు సమయం సరిపోతుందని సమంత వాపోయింది.

తాజాగా సమంత వర్కవుట్లు చేసుకుంటూ ఉంటే.. హష్ డిస్టర్బ్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను సమంత షేర్ చేసింది. అందులో సమంత వర్కవుట్లు చేసుకుంటూ ఉంటే అక్కడే తిరుగుతూ అల్లరి చేస్తున్నాడు. సమంత చేత్తో పక్కకు నెట్టేసి మరీ తన పని తాను చేసుకుంటూ పోయింది. పర్సనల్ స్పేస్ అంటే ఏంటి.. రెండేళ్లుగా నేను హష్‌కు ఇస్తూనే ఉన్నాను.. అంటూ ఫన్నీగా చెప్పేసింది.