టెర్రరిస్టుగా సమంత!?

Samantha

‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ వెబ్‌సిరీస్‌తో సమంత ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టింది. ఆమె లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌ నటించిన వెబ్‌సిరీస్ ఇది.  ఇందులో ఆమె టెర్రరిస్టుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సమంత రెగ్యులర్‌గా సినిమాల్లో నటించే పాత్రలతో పోలిస్తే.. ఇందులో ఆమె  చాలా వైవిధ్యమైన పాత్ర పోషించింది. అంతేకాదు, ఇందులో ఫైట్లు కూడా చేశారు. యాక్షన్‌ సీక్వెన్ల  కోసం శిక్షణ కూడా తీసుకుంది. అన్నింటికి మించి ఇందులో ఆమె నెగటివ్‌ షేడ్ ఉన్న పాత్ర పోషించింది. ఇలాంటి క్యారెక్టర్‌ని ఆమె పోషించడం కూడా ఇదే ఫస్ట్‌ టైమ్‌.

Samantha
Samantha

కెరీర్‌ పరంగానే కాకుండా పర్సనల్‌గానూ సమంత జీవితంలో ఓ ప్రత్యేకత పొందిన ఈ వెబ్‌ సిరీస్‌ను డిసెంబర్‌ నెలలో ప్రసారం చేసేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ సిద్ధమవుతోంది. అంతే  కాదు.. ఆమె లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌ నటించిన వెబ్‌సిరీస్‌ ప్రసారం కోసం ఓ అభిమానిలా అమితాసక్తితో ఎదురు చూస్తోందిట. తన  కెరీర్‌లో వెబ్‌ సిరీస్‌లో నటిస్తానని..ఆ వెబ్‌ సిరీస్‌ కోసం ఇలా ఆసక్తిగా ఎదురు చూస్తానని ఆమె ఎప్పుడూ ఊహించలేదుట “సరికొత్త సవాళ్లను స్వీకరిస్తేనే మనలోని ప్రతిభ బయటపడుతుంది” అని చెప్పే సమంత… ‘మహానటి, రంగస్థలం, ఓ బేబీ’ చిత్రాల్లో చాలెంజింగ్ పాత్రలు‌ చేసింది .

తాజాగా మరో చాలెంజింగ్‌ పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. ‘మయూరి, గేమ్‌ ఓవర్‌’ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఓ తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంలో బధిర యువతిగా నటిస్తుందట సమంత. సైకలాజికల్, హారర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.‌. ‘మహానటి’లో నత్తి ఉన్న అమ్మాయి పాత్రను అద్భుతంగా చేసింది సమంత . ఇప్పుడు మూగ, చెవిటి అమ్మాయిగా నటించడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ”నటిగా నాకు ఎలాంటి భయాలు లేవు.. ఎంతటి క్లిష్టమైన పాత్ర అయినా సరే చేయాలనుకుంటాను” అని అంటోంది సమంత. ఆమె  చెప్పినట్టుగానే అడుగులు వేస్తోందిప్పుడు. అల్ ది బెస్ట్ సమంత.