సమంతకు కూడా అలాంటివి ఎదురయ్యాయట!!

Samantha

సెలెబ్రిటీల నంబర్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లీకవుతుంటాయి. ఇక తాము ఆరాధించే వారి నంబర్లు అలా దొరికితే ఎవ్వరైనా ఊరుకుంటారా? ఒక్కడు సినిమాలో పాస్ పోర్ట్ ఆఫీస్ సీన్ రిపీట్ అవ్వదూ. తాజాగా సమంతకు అలాంటి పెద్ద కష్టమే వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలం అందరూ ఆన్ లైన్ ఆర్డర్స్‌కే మక్కువ చూపిస్తున్నారు. ఆ క్రమంలో ఫోన్ నంబర్లు బయటకు వస్తున్నాయి. అలానే సమంత నంబర్ కూడా బయటకు వచ్చినట్టుంది.

Samantha About Doosra Number
Samantha About Doosra Number

ఇక సమంత లాంటి స్టార్ హీరోయిన్ నంబర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ తాకిడి సమంత తట్టుకోలేకోపోయిందట. నిత్యం ఫోన్ కాల్స్ వచ్చేవట. ఫైనల్‌గా మాలాంటి వాళ్ల కోసం కొందరు ముందుకు వచ్చారు. మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచేందకు ఓ సైట్ వచ్చిందని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దూస్రా నంబర్ అంటూ ఓ సైట్ ఉందని దాని ద్వారా కొత్త నంబర్‌ను తీసుకున్నానని తెలిపింది.

అది ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రస్తుత పరిస్థితిలో తనకెంతో సాయ పడిందని తెలిపింది. ఫోన్‌లో సిమ్ లేకపోయినా సరే కొత్త నంబర్‌ను ఇవ్వడమే ఈ దూస్రా సైట్ పని అట. ఈ యాప్‌ను సమంత తాజాగా ప్రారంభించిందే. అందులో తనను ఎవరు కాంటాక్ట్ చేయాలో చేయకూడదో అనే వివరాలు కూడా ఉంటాయట. దీంతో తన నంబర్ లీకైనా సరే ప్రస్తుతం ఈ బాధలన్నింటి నుంచి సమంత తప్పించుకుంది. ప్రస్తుతం సమంత సాకీ వరల్డ్ బ్రాండ్, ఏకం స్కూల్స్ పనిలో బిజీగా ఉంది.