నాగచైతన్య, సమంత మధ్య ఏం జరుగుతోంది.?

ఈ మధ్య ఓ విడాకుల ఇష్యూ అత్యంత ఎక్కువగా ట్రెండింగ్ అయ్యిందంటే అది సమంత నాగ చైతన్య విడాకుల ఇష్యూనే అని చెప్పడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. విడాకులైపోయి చాలా కాలమే అయ్యింది. అయినా ఈ ఇష్యూ ఏదో ఒక మూల నుంచి రైజ్ అవుతూనే వస్తోంది. తాజాగా మరోసారి. సమంత తన కొత్త సినిమా ‘శాకుంతలం’ ప్రమోషన్లలో బిజీగా వుంది.

ఈ నేపథ్యంలోనే మళ్లీ విడాకుల ఇష్యూ సరికొత్తగా తెరపైకి వచ్చింది. భిన్న రకాలుగా కథనాలు వండి వడ్డించేస్తున్నాయ్ మీడియా సంస్థలు. విడాకులైపోయాక.. అసలు ఈ ఇద్దరి మధ్యా ఇంకేం జరుగుతుంది.? కానీ, తెరవెనుకాల కథ వేరేలా వుందట. ‘సెటిల్మెంట్’ వ్యవహారాలు నడుస్తున్నాయేమోనన్న డౌటానుమానాలు కలుగుతున్నాయి. సామ్,చై రీ-యూనియన్ జరగొచ్చేమో అని కూడా అంటున్నారు.

నాగచైతన్య మీద విమర్శలు చేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతుండడంతో, ‘నేనలా అనలేదు..’ అని సమంత స్పందించింది. ఈ కథనాలన్నీ తనపై తప్పును నెట్టేలా వున్నాయంటూ సమంత వాపోయింది. చూస్తుంటే, నాగచైతన్య మీద సమంతకి ఇంకా ‘లవ్’ అలాగే వున్నట్లుంది. నాగచైతన్య మాత్రం పూర్తిగా ఈ వ్యవహారంపై మౌనం దాల్చాడు.