సామజవరగమన.. ఇది బాక్సాఫీస్ లెక్క!

శ్రీవిష్ణు హీరోగా రెబా మౌనికా జాన్ హీరోయిన్ గా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సామజవరగమన. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో ఈ మూవీ థియేటర్స్ లో దూసుకుపోతోంది. మౌత్ టాక్ తోనే ఈ చిత్రం జనాల్లోకి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా దీనిని ఆవిష్కరించారు.

ఇక శ్రీవిష్ణుకి ఇలాంటి ఎంటర్టైనర్ కథలు పెర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసింది. అల్లూరి సినిమాతో యాక్షన్ హీరోగా ట్రై చేసిన దొరకని సక్సెస్ సామజవరగమన మూవీతో వచ్చింది. టికెట్ రేట్స్ కూడా తక్కువగా ఉండటంతో థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీవిష్ణు, నరేష్ కామెడీ మూవీకి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు.

ఫస్ట్ వీకెండ్ లోనే ఈ చిత్రం బ్రేక్ ఎవెన్ ని అందుకోవడంతో పాటు శ్రీవిష్ణు కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేస్తోన్న చిత్రంగా ఈ మూవీ నిలుస్తోంది. ఇంత వరకు ఎన్ని సినిమాలు చేసిన రాని హైప్ ఈ యంగ్ హీరోకి సామజవరగమన మూవీ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ మొదటి రోజు కేవలం 80 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే రెండో రోజు నుంచి క్రమంగా పుంజుకుంది.

రిలీజ్ అయ్యి 11 రోజులు అయిన కూడా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ లేదని చెప్పొచ్చు. సెకండ్ వీకెండ్ లో కూడా కలెక్షన్స్ అద్భుతంగా వస్తున్నాయి. 11వ రోజు ఈ చిత్రానికి 93 లక్షల గ్రాస్ వచ్చింది. మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కంటే ఇది ఎక్కువ అని చెప్పొచ్చు. దీనిని బట్టి ఈ చిత్రానికి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో చెప్పొచు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రవితేజ కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీగా రెండు గంటలు కూర్చొని హాయిగా నవ్వుకున్నాం అంటూ ఈ సినిమాపై తమ అభిప్రాయాలని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇవి కూడా సినిమాకి పాజిటివ్ వైబ్ పెంచడంలో ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు.