అందం, అభినయం, చిలిపితనం, చిరు మందహాసం, కొంటెతనం వీటన్నింటిని కలిపితే సమంత. అభిమానులు ఈమెను ముద్దుగా సామ్ అని పిలుచుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్న ఈ అమ్మడు సినిమాలని, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు అభిమానుల కోసం కాస్త టైం కేటాయిస్తూ ఉంటుంది. తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి నెటిజన్స్ వేసే విచిత్ర ప్రశ్నలకు సమంత చాలా చమత్కారంగా సమాధానమిస్తూ భలే గడుసు పిల్లరోయ్ అని అనిపించుకుంటుంది.
తాజాగా రామ లక్ష్మీ ( రంగస్థలం పాత్ర పేరు) ఫీలింగ్ గుడ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది. ఇందులో చెట్టుకు వేలాడుతూ సంతోషంగా కనిపించింది. ఈ ఫోటో నెటిజన్ ని ఎంతో ఇంప్రెస్ చేయడంతో.. చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం` అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు స్పందించిన సమంత.. `కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు` అని రిప్లై ఇచ్చింది. సమంత స్టన్నింగ్ రిప్లైకి నెటిజన్స్ సూపర్బ్ సామ్.. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి హ్యాట్సాఫ్ అనే కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ అమ్మడు ఓ బేబి తర్వాత మరో సినిమా చేయలేదు.నందిని రెడ్డి దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించేందుకు సన్నద్ధమవుతుంది. అలానే ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫాంలో టాక్ షో చేసేందుకు సిద్దమవుతుంది. ఇందులో ప్రముఖుల మనోభావాలు అడిగి తెలుసుకుంటుందట. కాగా, దసరా సందర్భంగా సమంత వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 దసరా స్పెషల్ మహా ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అలరించింది. మూడు గంటల పాటు సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ 11.4 టీఆర్పీ సాధించింది.