అఖిల్ అయ్యగారి సినిమాలో హీరోయిన్ గా ఆ హాట్ భామ !

అఖిల్ అక్కినేని .. అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తోలి విజయం కోసం ఇంకా ఎదురుస్తూనే ఉన్నాడు. అక్కినేని ఫ్యాన్స్ ను సంతృప్తి పరచే హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హీరోయిన్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే రోజున విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో చిత్రీకరణలో ఉన్నప్పుడే మరో చిత్రానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అఖిల్ కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే..

ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ కోసం గత కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అయితే ఇటీవల కథానాయిక దొరికేసిందట. అఖిల్ 5వ సినిమాలో అతడితో రొమాన్స్ చేసేందుకు మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్యను ఎంపికచేశారట.

దర్శకుడు సురేందర్ అభిప్రాయం ప్రకారం అఖిల్‌ కు ఆమె సరైన జోడీగా ఉంటుందట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే సినిమా పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. సినిమా సెట్స్ మీదకి వెళ్లే సమయంలో హీరోయిన్ గురించి చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించనుంది.