సైంధవ్.. వెంకీ మామా బిగ్గెస్ట్ రెమ్యునరేషన్

విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా చిత్రం సైంధవ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా వెంకీ మామకు సైంధవ్ 75వ సినిమా. ఈ చిత్రానికి హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్నారు. గత నెల 26వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం అయిపోయాయి. ఈ సినిమాలో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో తన ఏజ్ కి తగ్గట్లుగా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.

అయితే ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్ అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ విక్రమ్ స్టైల్ లోనే వెంకీ మామ న్యూ లుక్ లో కనిపించనుండగా… ఈ పాత్ర కోసం వెంకటేష్ 15 నుంచి 17 కోట్లు తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ఇప్పటికే వెంకీ లుక్ ను రిలీజ్ చేశారు.

అలాగే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కిలిసి కలిసి నటించిన ఎఫ్3 సినిమాకు కూడా వెంకీ మామ భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నారు. ఎఫ్2 సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో… ఎఫ్ 3 సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అ తర్వాత వచ్చిన ఓరి దేవుడా సినిమాలో కూడా వెంకీ నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో కనిపించింది 15 నిమిషాలే అయినా 3 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. అలాగే ఇప్పుడు తాజాగా నటిస్తున్న సైంధవ్ చిత్రానికి 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు.

సైంధవ్ సినిమా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా వెంకీ పాత ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు వెంకీ మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. రానాతో కలిసి వెంకటేష్.. రానానాయుడు వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు.