సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. నాగ చైతన్య తో లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. సహజమైన కథ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ గ్యారెంటీ గా హిట్ అని సాయి పల్లవి, నాగ చైతన్య తో పాటు చిత్ర యూనిట్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారట. ఇక రానా తో విరాట పర్వం అన్న సినిమాలో నక్సలైట్ పాత్రలో కనిపించబోతుంది సాయి పల్లవి. కాగా ఈ సినిమా షూటింగ్ ని కూడా సాయి పల్లవి త్వరలో కంప్లీట్ చేయబోతోందట.
కాగా మరోసారి నేచురల్ స్టార్ నాని తో శ్యాం సింగ్ రాయ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చింది. ఈ సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం లో కూడా నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సాయి పల్లవి సైన్ కూడా చేసిందని త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారని అంటున్నారు. అంతేకాదు తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం.
ఇన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి షూటింగ్ స్పాట్ లో తనకి ఎదురైన ఒక అనుభావాన్ని ఇటీవల బయట పెట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా సమయంలో తను చీర కట్టుకోవాల్సి వచ్చిందట. నెక్స్ట్ తీయాల్సిన సీన్ కోసం చీర కట్టుకోవాల్సి ఉండగా అక్కడ సాయి పల్లవికి ప్లేస్ సెట్ కాలేదట. ఈ విషయాన్ని దర్శకుడితో చెప్పిందట. అయితే ఇలాంటి విషయాలలో కాంప్రమైజ్ కాకూడదని నీకు ఎలాంటి అవసరాలున్నా నిర్మొహమాటంగా చెప్పాలని ఇక్కడే కాదు ఏ సినిమా షూటింగ్ సమయంలో అయినా ఇబ్బందులని బయటకి ధైర్యంగా చెప్పాలని సూచించాడట. అప్పటి నుంచి సాయి పల్లవి కాస్త ధైర్యంగా తనకి కావాల్సిన మేకర్స్ సూటిగా చెబుతున్నట్టు తెలిపింది.