శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా టాలివుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను నటించిన మొదటి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వివాదాలకు దూరంగా ఉంటూ తెలుగుతనం ఉట్టిపడేలా కట్టు బొట్టు తో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి నటించిన “గార్గి” సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా కథ నచ్చక సినిమాలకు దూరంగా ఉంటున్న సాయి పల్లవి ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ నేను మొహమంతా మొటిమలతో అందంగా లేకపోవటం వల్ల కెరీర్ ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. దీంతో ప్రేమమ్ సినిమా షూటింగ్ సమయంలో కూడా సినిమా మద్యలోనుండి తేసేయరు కదా అని డైరక్టర్ ని చాలాసార్లు అడిగా.. అంటూ చెప్పుకొచ్చింది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోతో నటించాలని ఉంది? అని యాంకర్ ప్రశ్నించగా… డైరక్టర్ వచ్చి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది అని చెప్పినా కూడా ఎవరు అని అడగకుండా మొదట కథ చెప్పమని అడుగుతా. ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో చిన్న పెద్ద అని తేడా లేకుండా నచ్చితే ఎవరితో చేయడానికైనా నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే మహేష్ బాబు స్క్రీన్ ప్రజెంన్స్ చాలా బాగుంటుందని వెల్లడించింది. అంతే కాకుండా
” మహేష్ బాబు ని మొదటిసారి చూసినప్పుడు మగాళ్లు కూడా ఇంత అందంగా ఉంటారని అనుమానం వచ్చింది” అంటూ మహేష్ బాబు అందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.